Sunday, March 4, 2012

ఏకవీర (దారి తప్పిన వీరుడు , మరి ఆ దారి చీకటిమయం)

"అతడు పదిరోజుల్లో చచ్చిపోతాడని తెలిసీ పెళ్ళి చేసుకుంటనంటవేందమ్మా?"
... "చనిపోకుండా ఉండేవాడెవడో చూపించయ్య.. వాడిని చేసుకుంటాను."
- ఇలాంటి స్పర్శ ఉన్నంత మాత్రాన ఏకవీర అనబడే ఈ సినిమా పరసువేది కాదు.
మొదటి సగం చీకట్లో కళ్ళకు శ్రమ కలిగిస్తే, రెండో సగం పొడుపుకథలా సాగి మెదడుకు శ్రమ కలిగించింది. అయినా ఇది ఒక ప్రయోగం- లోపమున్నా అహ్వానించాల్సిందే. మూస దారి పట్టనందుకు, దర్శకుడు తను నమ్మిన విధంగా తీసినందుకు.
18వ శతాబ్ది దోపిడిదారుల కథ (థగ్గులు?). నరబలి మనుషులకు మానవత్వానికి సంబంధించింది కాదని చెప్పే ప్రయత్నం చేసి, నేటికీ మరణ దండన అమలులో ఉండడాన్ని ప్రశ్నిస్తూ, దర్శకుడు సినిమాను ముగిస్తాడు.
దోపిడిదారుల ఆచారంలోని అజ్ఞానం, దాన్ని వాడుకునే జమిందారు లాంటి పైతరగతి వారి విలాసాల లొసుగులు కథాంశం. దాని దారిలో దర్శకుడు పక్కకు ముందుకు నడుస్తే సంగీతం అందుకు తాళం వేసింది.
ఈ కథలో చేయి పెట్టే ముందు ఈ దర్శకుడు ఒకసారి తన ఆలొచనను ఎడిట్ చేసుకుని, విడుదల చేసేముందు సాగతీత దృశ్యాలను ఎడిట్ చేయిస్తే మంచి నటుల శ్రమకు తగిన విలువుండేది.
నా పక్క సీట్లో వీక్షకుడి కామెంట్.. "ఈ అరవ సినిమాలకు ఈరోగమేంది-మొన్న జర్నీ ట్రాజడీ సరే, పొద్దున మల్లిగాడు అదీ అంతే, ఇప్పుడు వీడూ మాడు పగలకొట్టాడు..."

No comments:

Post a Comment