దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు బుజ్జాయి(డుంబు పాత్ర సృష్టికర్త)తనకు తెలిసిన వాళ్ళ నాన్న,అతనితో ఇతని పయనం గురించి చెప్పిన పుస్తకం "నాన్న-నేను". ఇందులో 200 పేజీలున్నాయి. అమ్మ అనే వ్యక్తి ఎక్కడుందా? అని వెతికాను. 23వ పేజిలో ఒకసారి బుజ్జాయి పుట్టకముందు ఆమెతో కృష్ణశాస్త్రి వివాహం, తరవాత 145వపేజీలో కృష్ణశాస్త్రి చనిపోయినపుడు పరిస్థితి బుజ్జాయి ఇలా చెబుతాడు..." తెల్లవార్లూ మానా...న్న బాడీ పక్కనే మా అమ్మ కూర్చునిఉంది. గబుక్కుమని ఆయన లేచి కూర్చుంటారేమో అనుకుంది. ఆమె చాలా అమాయకురాలు. ఆమెకి సర్వం మా నాన్నే. బైట ప్రపంచం ఏమీ తెలియదు. వెర్రిది. ఆమె మొహం చూడడానికి కూడా నాకు భయం వేసింది". అవును-కళాకారులు, కవుల జీవితాల్లో మెరుపులు మనవి. మరకలు కుటుంబానివి. మరీ ప్రత్యేకం వారి భార్యల స్థితి. చర్చ ఆధునిక "Simon de Beauvoir"లకు వదిలేద్దాం.
ఈ పుస్తకంలో కృష్ణశాస్త్రి కవి కాదు, వక్తా కాదు.. కేవలం నాన్న పాత్రధారి. స్కూలుకెళ్ళకపోయినా నేటి సమాజంలో నిలబడే "education" అందుకున్న బుజ్జాయి కథ ఇది. సమాజం నుంచి బయటకు వెళ్ళిన చలం పిల్లల కంటే, సమాజంతో రాజీ పడ్డ దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు అదృష్టవంతుడు అని చదివి మీకూ అనిపిస్తే తప్పు ఏ మాత్రం లేదు, కాదు..!